తెలంగాణ

telangana

ETV Bharat / international

విషవాయువు లీకై 46 మంది ఆస్పత్రిపాలు

కెనడాలో ఘోర దుర్ఘటన జరగింది. కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకర స్థాయిలో విడుదలైన కారణంగా మాంట్రియాల్​ నగరంలోని ఓ హోటెల్​లో  46 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.

విషవాయువు లీకై 46 మంది ఆస్పత్రిపాలు

By

Published : Jul 10, 2019, 11:25 AM IST

కెనడాలోని ఓ హోటల్​లో విషవాయువు లీకైన కారణంగా 46మంది ఆస్పత్రి పాలయ్యారు. 15మంది పరిస్థితి విషమంగా ఉంది. మాంట్రియాల్ నగరంలోని 'సూపర్ 8 మోటెల్'​లో ఈ దుర్గటన జరిగింది.

'ఇది చాలా పెద్ద ప్రమాదమని' ఓ అధికారి వ్యాఖ్యానించారు. విడుదలైన వాయువును కార్బన్ మోనాక్సైడ్​గా గుర్తించామని వెల్లడించారు. ఈ దుర్ఘటన మోటెల్​లోని గ్యాస్ లీక్ కావడం వల్ల జరగలేదని మరో అధికారి స్పష్టం చేశారు. ప్రమాదకర వాయువు ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

విషవాయువు లీకై 46 మంది ఆస్పత్రిపాలు

ఇదీ చూడండి: రూ.200 కోసం కెన్యా నుంచి భారత్​కు..!

ABOUT THE AUTHOR

...view details