ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో లక్షా 25 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 4,160 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసులు 69 లక్షలు దాటిపోయాయి. ఒకట్రెండు రోజుల్లో 70 లక్షల మార్కును అధిగమించనున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా మరణాలు 4 లక్షలు మించిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య 70 లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల వ్యవధిలో లక్షా 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు
అమెరికాలో మొత్తం కేసులు 19.88 లక్షలు, మరణాలు 1.12 లక్షలు దాటాయి. కొత్తగా 22 వేల మంది వైరస్‌కు చిక్కగా, 705 మంది మృత్యువుపాలయ్యారు. ఇండోనేసియాలో కొత్తగా 993 కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో శనివారం కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో కొత్తగా ఐదు మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది. వీరిలో ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చినవారే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,030కి చేరింది.
Last Updated : Jun 7, 2020, 6:32 AM IST