మెక్సికోలో దారుణం జరిగింది. మిచోవాకాన్ రాష్ట్రంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని దుండగులు తుపాకితో దాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తూటాలు కారు ఇంధన ట్యాంకులోకి చొచ్చుకెళ్లిన కారణంగా వాహనం పూర్తిగా దగ్ధమయింది.
గత కొన్ని నెలలుగా మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో జరిగిన దాడితో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులపై దాడి చేయటం పిరికిపంద చర్యని.. రహదారిపై వెళ్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు చేసి మట్టు పెట్టారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరో కేసు విచారణ కోసం వెళ్తుండగా ఈ దాడి జరిగిందని సమాచారం.
2006 నుంచి 2012 మధ్య మెక్సికో పోలీసులు, ఉగ్రవాదులకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత క్రూరమైన చర్యగా స్థానిక మీడియా సంస్థలు అభివర్ణించాయి.
పోలీసులపై దుండగుల దాడి-13 మంది మృతి! ఇదీ చూడండి: మోదీ బొమ్మతో కర్ణాటక యువకుడి ప్రపంచ రికార్డ్