సుడాన్లో నిరసనకారుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యం.. పౌరప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ దేశ రాజధాని ఖర్తూమ్కు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలు.
సుడాన్లో ఎప్పటినుంచో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఎంతోకాలంగా అధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అల్ బషీర్ ఇటీవల సైన్యం తిరుగుబాటుతో గద్దె దిగారు. ఆయన స్థానంలో సైన్యాధిపతి అహ్మద్ ఔఫ్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఒమర్ తప్పుకున్నా అహ్మద్ అధికారం చేపట్టడంపై సుడాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఫలితంగా ఒక్కరోజుకే అహ్మద్ రాజీనామా చేశారు.