తెలంగాణ

telangana

ETV Bharat / international

కీటకాలతో ఆఫ్రికన్ల నోరూరించే ఐస్​క్రీం...!

ఇప్పటి వరకూ ఐస్​క్రీం అంటే పాలతో తయారు చేసే పదార్థమని మాత్రమే తెలుసు. అయితే కీటకాలతో కూడా ఐస్ క్రీం తయారు చేస్తారని తెలుసా? తెలియకపోతే దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందే.

కీటకాలతో ఐస్​క్రీం

By

Published : May 5, 2019, 7:20 AM IST

Updated : May 5, 2019, 8:41 AM IST

కీటకాలతో ఐస్​క్రీం.. ఇష్టంగా తింటున్న ఆఫ్రికన్లు

ఐస్​క్రీం పేరువినగానే చాక్లెట్, వెనీలా ఇలా ఇంకా చాలా పేర్లు గుర్తొస్తాయి. దక్షిణాఫ్రికాలోని కేప్​ టౌన్​లో మాత్రం ఓ కొత్త రకం ఐస్​క్రీం​ తయారు చేస్తున్నారు కొందరు ఔత్సాహికులు.

ఇందులో ప్రత్యేకతేముంది అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు ఉన్న ఐస్​క్రీంలు అన్నీ పాలతో తయారు చేసినవైతే.. ఈ ఐస్​క్రీం మాత్రం చిన్నచిన్న కీటకాలతో తయారు చేసింది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం.

కీటకాల లార్వాతో చేసిన ఈ ఐస్​క్రీం వల్ల హాని ఉండదంటున్నారు అక్కడి నిపుణులు. 'కేప్ టౌన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ' కేంద్రంగా పని చేస్తోన్న 'గౌర్​మెట్​ గ్రాబ్'​ సంస్థ ఈగల లార్వాను మూల పదార్థంగా చేసుకుని ఈ ఐస్​క్రీంను తయారు చేస్తోంది.

ఐస్​క్రీం యంత్రంలో లార్వా మిశ్రమాన్ని వేసే ముందు కోకో, తేనె సహా ఇతర సహజ పదార్థాలను ఇందులో కలుపుతున్నట్లు వెల్లడించింది.

ఈగ లార్వాలో చాలా పోషకాలు ఉంటాయని... అయితే ఇది అందరికి నచ్చుతుందని చెప్పలేమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కేప్ ​టౌన్ ప్రొఫెసర్​, డాక్టర్ మైక్ పికెర్.

ప్రస్తుతం ఈ ఐస్​ క్రీంను 'ఓల్డ్ బిస్కట్​ మిల్క్​' మార్కెట్లో వారానికోసారి విక్రయిస్తున్నారు. త్వరలోనే రిటైల్​ స్టోర్​ను తెరిచి నిత్యం అమ్మకాలు జరుపుతామంటున్నారు నిర్వాహకులు. ఆ తర్వాత జొహెన్స్​బర్గ్​లో మరో స్టోర్ సహా వీలైనంత త్వరగా ఐరోపా, అమెరికాల్లో కూడా రిటైల్ స్టోర్లను తెరవనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: యూఏఈ లాటరీలో 28కోట్లు గెలిచిన భారతీయుడు

Last Updated : May 5, 2019, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details