హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లోని గంగపుత్ర కాలనీ, మొరంబొంద, బాపూజీనగర్‌లో భాజపా అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తు ఓటు వేయాలని కోరారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అవకాశం ఇవ్వండి: భాజపా అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్
తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ముషీరాబాద్ డివిజన్ భాజపా అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్ ప్రజలను కోరారు. డివిజన్లోని గంగపుత్ర కాలనీ, మొరంబొంద, బాపూజీనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అవకాశం ఇవ్వండి: భాజపా అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్
ముషీరాబాద్ డివిజన్లో గత కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్ కుటుంబ పాలన కొనసాగించారని అన్నారు. వరద సాయం అందక ప్రజలు ఇబ్బందలు పడుతున్నారని చెప్పారు. భాజపాను గెలిపిస్తే ఇంటికి రూ.25 వేలు ఇస్తామన్నారు. అవినీతి రహిత పాలన అందించడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్