తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేశారు : అనితా పద్మారెడ్డి - అనిత

హైదరాబాద్​ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను తెరాస పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఎక్కడి డ్రైనేజీ అక్కడే పొంగిపొర్లుతోందని, ఎక్కడపడితే అక్కడ చెత్త డంపింగ్ యార్డులు తయారయ్యాయని నాచారం భాజపా అభ్యర్థి అనితా పద్మారెడ్డి విమర్శించారు. తనను గెలిపిస్తే నాచారం డివిజన్​ను ఆదర్శంవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేశారు : అనితా పద్మారెడ్డి
పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేశారు : అనితా పద్మారెడ్డి

By

Published : Nov 26, 2020, 4:59 PM IST

నాచారం డివిజన్ బీజేపీ అభ్యర్థి అనితా పద్మారెడ్డి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గెలిపిస్తే నాచారం డివిజన్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. తెరాస పాలనలో నాచారం తదితర ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అనితా పద్మా రెడ్డి విమర్శించారు. పటేల్ కుంట చెరువును డంపింగ్ యార్డ్​గా మార్చారని, దీంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు వ్యాధిగ్రస్థులు అవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరద సహాయం కోసం వరద బాధితులు ఇంకా ఎదురుచూస్తున్నారని వరద సహాయం మొత్తం తెరాస నాయకుల జేబుల్లోకి చేరిందని పద్మా రెడ్డి విమర్శించారు. భాజపాను గెలిపిస్తే ప్రతి వరద బాధిత కుటుంబానికి 25 వేల రూపాయలు సహాయం అందిస్తామన్నారు. తనకు సహకరిస్తున్న జనసైనికులకు, జనసేన అధినేతపవన్ కల్యాణ్​కు కృతజ్ఞతలు తెలిపారు.

పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేశారు : అనితా పద్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details