Trisha Salman Khan: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కెరీర్లో జోరు పెంచింది. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. పొన్నియిన్ సెల్వన్- 2, ది రోడ్, లియో చిత్రాల్లో లీడ్ రోల్లో నటించి విజయాలు అందుకుంది. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అందులో ఓ మలయాళం సినిమా కూడా ఉంది.
ఈ భామ 13 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా పలు కథనాలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు బీ టౌన్లో టాక్ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కిస్తున్న 'ది బుల్' సినిమాలో త్రిషను హీరోయిన్గా అనుకున్నారట. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ పారామిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానునందట. ఒకవేళ ఈ టాక్ నిజమైతే త్రిష బాలీవుడ్ రీ ఎంట్రీ కన్ఫార్మ్ అవుతుంది.
Trisha Bollywood: అయితే త్రిష 2010లోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన 'ఖట్టా మీఠా' సినిమాలో నటించింది. ఆ తర్వాత హిందీలో పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్ల త్రిష సౌత్ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది.