Tapsee Mithali raj trailer: హీరోయిన్ తాప్సీ.. టైటిల్ రోల్ పోషించిన బయోపిక్ 'శభాష్ మిథు'. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీరాజ్ నిజజీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌విడుదలై ఆకట్టుకుంటోంది. చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
'శభాష్ మిథు' ట్రైలర్ ఆగయా.. మిథాలీగా అదరగొట్టిన తాప్సీ - తాప్సీ మిథాలీ రాజ్ బయోపిక్
Tapsee Mithali raj trailer: భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'శభాష్ మిథు'. తాప్సీ టైటిల్ రోల్ పోషించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
"మెన్ ఇన్ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్ ఇన్ బ్లూ అనే ఓ టీమ్ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను" అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది. ఇక, మిథాలీ రాజ్‌గా తాప్సీ నటన అదరగొట్టేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. జులై 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ ముఠా హిట్‌లిస్ట్‌లో కరణ్‌జోహార్!