Sharukh khan Dunki movie: నాలుగేళ్ల నుంచి వెండితెరపై కనిపించని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 2023లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడాయనకు ఓ షాక్ తగిలింది. ఆయన నటించే సినిమాల్లో ఒకటి తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఏం జరిగిందంటే.. ప్రస్తుతం షారుక్ 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలు చేస్తున్నారు. అయితే రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వం వహిస్తున్న 'డంకీ'కి అడ్డంకులు ఎదురయ్యాయి. సెట్స్‌పైకి వెళ్లి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న అమిత్ రాయ్.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చారు అమిత్ రాయ్. తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశారు. "తొలి షెడ్యూల్‌లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానికి మధ్య మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం" అని చెప్పుకొచ్చారు.