తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సెట్స్​లోకి రాకముందు వెంకీ ఆ పని చేస్తారు - అలా చెప్పడం నాకసలు ఇష్టం ఉండదు'

Saindhav Villain Nawazuddin Siddiqui : పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయి నేచురల్​గా చేయడంలో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ స్టైలే వేరు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన 'సైంధవ్​'తో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే.

Saindhav Villain Nawazuddin Siddiqui
Saindhav Villain Nawazuddin Siddiqui

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 6:41 AM IST

Saindhav Villain Nawazuddin Siddiqui :తన విలక్షణమైన నటనతో వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తూ మూవీ లవర్స్​ను ఆకట్టుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. తాజాగా ఆయన టాలీవుడ్​లోకి తెరంగేట్రం చేశారు. విక్టరీ వెంకటేశ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'సైంధవ్‌' చిత్రంతో తొలిసారి తెలుగు ఆడియెన్స్​ను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.

మీకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. కానీ, తెలుగులోకి అడుగు పెట్టడానికి ఎందుకింత ఆలస్యమైంది?
''ప్రతి యాక్టర్​కు ఓ మంచి స్టోరీ కావాలనే ఎదురు చూస్తుంటాడు. నేను కూడా అలాగే సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూశాను. 'సైంధవ్‌' నా నిరీక్షణకు తెర దించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. వెంకటేశ్‌తో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ కల. అలాంటిది తెలుగులో నా మొదటి సినిమాను ఆయనతో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది''.

ఈ మధ్య మీరు ప్రతినాయక పాత్రలు తగ్గించారు కదా. 'సైంధవ్‌'లో చేయడానికి కారణమేంటి?
''నేనెప్పుడూ హీరోనా లేకుంటే విలనా అన్న విషయాన్ని లెక్క పెట్టుకోను. నేను చేయనున్న పాత్ర ఆసక్తికరంగా ఉందా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. వాస్తవానికి కొన్నిసార్లు పాజిటివ్‌ పాత్రలకంటే నెగిటివ్ షేడ్స్​ ఉన్న రోల్స్​లోనే మన ట్యాలెంట్​ను సమర్థవంతంగా, మరింత కొత్తగా చూపించుకునే అవకాశాలు దొరుకుతాయి. 'సైంధవ్‌'లో నా రోల్​ను డైరక్టర్​ శైలేశ్‌ కూడా అంతే వినూత్నంగా తీర్చిదిద్దాడు. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్ర కాబట్టే నేను ఈ సినిమా చేయాలని అనుకున్నాన ు''.

ఇది వెంకటేశ్‌కు 75వ చిత్రం. దీన్ని ఎంత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు?
''భారీ యాక్షన్‌ ఉన్న సినిమా ఇది. అదే స్థాయిలో ఫ్యామిలీ ఎమోషన్స్​ కూడా ఉంటుంది. వెంకటేశ్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నో భిన్నమైన పాత్రలను పోషించారు. కానీ, దీంట్లో ఆయన్ను మీరు మరింత భిన్నంగా ఓ కొత్త అవతారంలో చూస్తారు. శైలేశ్‌ స్టోరీ వినిపించినప్పుడే ఇది తప్పకుండా పెద్ద సక్సెస్​ సాధిస్తుందనే నమ్మకం నాకు కలిగింది. తను కథను ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా తెరకెక్కించారు''. వెంకటేశ్‌తో ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. సెట్లోకి అడుగు పెట్టడానికి ముందే తన డైలాగ్స్‌ను నేర్చుకొని వస్తారు. యాక్షన్‌ సీన్స్‌లో చాలా రిస్క్‌లు తీసుకున్నారు. డూప్‌ లేకుండానే స్వయంగా యాక్షన్‌ చేశారు. ఈ జర్నీలో తన నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకు సహనం ఎక్కువ. అది తన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి''.

తొలి సినిమాకే తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏంటి?
''నా పాత్రకు వేరెవరో డబ్బింగ్‌ చెప్పడం నాకసలు ఇష్టం ఉండదు. దాని వల్ల ఆ పాత్రలో అంత డెప్త్‌ ఉండదు. ఇందులో నాది హైదరాబాదీ పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడుతుంది. అందుకే ఆ పాత్రకు నేను డబ్బింగ్‌ చెబితేనే న్యాయం జరుగుతుందని అనుకుని ఎంతో కష్టపడి భాషను, భావాన్ని అర్థం చేసుకొని మరీ తెలుగులో డబ్బింగ్‌ చెప్పా. ఈ విషయంలో దర్శకుడు శైలేశ్‌ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు''.

ఈ చిత్ర విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
''యాక్షన్‌ సీక్వెన్స్‌ నాకు బాగా సవాల్‌గా అనిపించాయి. ఎందుకంటే వాటిని అంత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా శ్రీలంక షెడ్యూల్‌ను అసలు మర్చిపోలేను. సముద్రంలో బోట్స్‌పై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ జరిగింది. అందులో నేను బోట్‌పై స్పీడ్‌గా వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారిగా బోట్‌ వదిలేసి అలతో పాటు నేను గాల్లోకి అంతెత్తున లేచాను. అదృష్టవశాత్తూ మళ్లీ ఆ బోట్‌లోనే ల్యాండ్‌ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్‌ సినిమాలో కనిపిస్తుంది. ఆ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తారు''.

నవాజుద్దీన్​ సినిమా కోసం మూవీ టీమ్​ సాహసం.. ఆ 300 మంది..

వెంకీ 'సైంధవ్' నుంచి నవాజుద్దీన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. లగ్జరీ కారుపై కూర్చుని బీడీ తాగుతూ!

ABOUT THE AUTHOR

...view details