Pushpa 2 release date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప' తొలి భాగం... దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్‌లు, శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాయి. 'తగ్గేదే లే' అని పుష్పరాజ్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజాన్ని అనుకరించనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పుష్ప రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Pushpa 2 poster:ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రెండో భాగం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. పలు పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. సోమవారం చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సీక్వెల్‌ను భారీస్థాయిలో తీసుకొస్తున్నట్లు తెలిపారు. అభిమానులు ఈ సర్ప్రైజ్ అప్డేట్తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.