Adipurush Theatrical rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' జూన్ 16న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మరో 20 రోజులు మాత్రమే ఉంది. అయితే తాజాగా అదిరిపోయే సమాచారం అందింది. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను కళ్లు చెదిరే రేటుకు ఓ బడా నిర్మాణ సంస్థ తీసుకుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas Maruthi Movie : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని సమాచారం అందింది. రూ. 170 కోట్లకు కొనుగోలు చేసిందట. అంతకుముందు ఈ చిత్ర హక్కులు యూవీ క్రియేషన్స్ రూ.100కోట్లకు కొనుగోలు చేయగా.. అది రూ.70కోట్ల లాభంతో పీపుల్స్ మీడియాకు అమ్మిందట. ఇకపోతే ఈ పీపుల్స్ మీడియా బ్యానర్లో ప్రస్తుతం ప్రభాస్ ఓ సినిమా కూడా చేస్తున్నారు. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, అంతకుముందు తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్'ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 226 కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. 'బాహుబలి 2' రూ. 120 కోట్లు, 'సాహో' రూ. 125 కోట్లు, సైరా నరసింహారెడ్డి రూ.115కోట్లు, రాధేశ్యామ్ రూ.107కోట్లు బిజినెస్ జరిగిందట. అంటే 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'ఆదిపురుష్'ది ఇప్పుడు రెండో స్థానం.