గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ 32వ సినిమాపై పలు ఉహాగానాలు వెలువడుతున్నాయి. జాతీయ అవార్డ్ గెలుచుకున్న కోలివుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తారక్.. తన 32వ సినిమా చేయనున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌కు వెట్రిమారన్ మూడు కథలు చెప్పాడని అందులో తారక్ ఓ కథను ఒకే చేసినట్లు టాలివుడ్, కోలివుడ్లో కొన్ని వార్తలు తెగ సందడి చేశాయి. అయితే కోలివుడ్ వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటున్నాయి.ఒకవేళ అది నిజమే అయినా ప్రస్తుతం తారక్‌కు ఉన్న బిజీ షెడ్యుల్‌లో అది వీలుపడకపోవచ్చు. ఇప్పటికిప్పుడు వెట్రిమారన్ సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా వచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, వెట్రిమారన్ తమ సొంత ప్రాజెక్ట్‌ల్లో పుల్ బిజీగా ఉన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్‌తో ఎన్టీఆర్ కొత్త సినిమా లేనట్టేనా? - జూనియర్ ఎన్టీఆర్ 32వ సినిమా
కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఎన్టీఆర్ 32వ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం దీని గురించే సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..
ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ నెలలోనే ఆ సినిమా చిత్రీకరణ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత తారక్ 31వ సినిమా.. కేజీఎఫ్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇవన్ని పూర్తయ్యే సరికి కనీసం సంవత్సరన్నరకు పైగా సమయం పడుతుంది.
మరోవైపు వెట్రిమారన్ కూడా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న విడుతలై సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సూర్య హీరోగా వాడివాసల్ అనే సినిమాను రూపొందింటే పనులో బిజీగా ఉంటాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. జల్లికట్టు బ్కాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. కాబట్టి తారక్, వెట్రి.. ఇద్దరు మరో రెండేళ్ల వరకు ఫుల్ బిజీగీ ఉన్న కారణంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తోంది.