Most watched Indian web series : కంటెంట్ ఉండాలే కానీ.. స్టార్ కటౌట్లు కూడా లేకుండానే సినిమాలు రికార్డులు తిరగరాస్తున్న రోజులివి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ విస్తృతి పెరిగిన తర్వాత క్రియేటివిటీతో కూడిన సబ్జెక్టులు తెరపైకి వస్తున్నాయి. వెబ్ సిరీస్ ల రూపంలో అద్దిరిపోయే కంటెంట్.. ప్రేక్షకుల చేతివేళ్లకు అందుబాటులో ఉంటోంది. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కథ బాగుంటే చాలు.. థియేటర్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి పలు చిత్రాలు. మరి.. ఇప్పటి వరకూ ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీసులు ఏవీ..? ఎన్ని వ్యూస్ సాధించాయి..? అన్న వివరాలు ఇక్కడ చూద్దాం.
పంచాయత్ (Panchayat) : 2020లో వచ్చిన ఈ సిరీస్ చక్కటి జనాదరణ పొందింది. దీపక్ కుమార్ మిశ్రా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. ఈ చిత్రానికి 29 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ లలో టాప్-5 లో ఉంది.
క్యాన్సర్తో 'షాపింగ్ మాల్' నటి సింధు మృతి.. వైద్యానికి డబ్బుల్లేక ఇంట్లోనే..
మీర్జాపూర్ (Mirzapur) : ఈ వెబ్ సిరీస్ 2018లో విడుదలైంది. యూపీలోని మీర్జాపూర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ ఉత్తర ప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందంటూ వివాదాస్పదమైంది. రెండు సీజన్లుగా వచ్చింది. ఈ సిరీస్ కు 32 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వెబ్ సిరీస్ ల లో టాప్-4 లో ఉంది.