Miss ShettyMR Polishetty Box Office Collection : సీనియర్ హీరోయిన్ అనుష్క దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన కొత్త సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్‍తో తెచ్చుకుంది. ఈ చిత్రం రిలీజ్ రోజే షారుక్ జవాన్ విడుదల కావడం వల్ల ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా మౌత్ టాక్‍తో హిట్ టాక్ తెచుకుని బాక్సాఫీస్ వద్ద జోరు అందుకుంది. దీంతో ఇప్పుడీ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి.
కామెడీ ఎంటర్టైనర్ అండ్ సరోగసీ కాన్సెప్ట్‌తో ఫన్నీగా రూపొందింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పచ్చిగొళ్ల డెరెక్ట్ చేశారు. ఏడో రోజు ఈ చిత్రం నైజాం రూ. 31 లక్షలు, సీడెడ్ రూ. 5 లక్షలు, ఆంధ్ర రూ. 24 లక్షలు కలిసి రూ. 60 లక్షల షేర్, రూ. 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. మొత్తంగా ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి నైజాంలో రూ. 5.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.39 కోట్లు కలిపి రూ. 9.50 కోట్లు షేర్, రూ. 16.75 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది.
Miss Shetty MR Polishetty Collection Worldwide : వరల్డ్ వైడ్‌గా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల షేర్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.95 షేర్ వసూలు చేసంది. మొత్తంగా రూ. 16.75 కోట్లు షేర్, రూ. 32.45 కోట్లు గ్రాస్ కలెక్షన్లను అందుకుంది.