ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఇన్‌స్టాలో తెలిపారు. అకౌంట్ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు. "నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్ జోలికి వెళ్లదు. దాని నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను గమనించొద్దు" అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు మనోజ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. సస్పెన్షన్‌పై క్లారిటీ ఇచ్చిన 'కాంతార' కిశోర్!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతుండగా ఆయన ఇన్‌స్టాలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, కాంతార ఫేమ్ నటుడు కిశోర్ కుమార్ అకౌంట్ సైతం ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు.
బాలీవుడ్లో ఇలా ఉండగా సాండల్‌వుడ్‌లోనూ ఇటీవలే ఓ స్టార్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. కాంతార ఫేమ్ కన్నడ స్టార్ కిశోర్ కుమార్‌కు ట్విట్టర్లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఖాతాలను సంస్థ నిలిపివేస్తుంది అని ఆయన పేజ్‌లోకి వెళ్లినవారికి ఈ సందేశం కనిపిస్తోంది. దీంతో ఆయన ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని కొందరు అంటుంటే.. తన పోస్ట్‌ల కారణంగానే ఇలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్ ఇన్‌స్టాలో తెలిపారు.