తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేష్ త్రివిక్రమ్​ల కొత్త చిత్రం ఎప్పుడంటే - మహేష్ త్రివిక్రమ్​ల కొత్త చిత్రం

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చే సినిమా అంటే ఫ్యాన్స్​కు పండగే. అతడు, ఖలేజా వంటి బ్లాక్​బస్టర్ సినిమాల తరువాత వారిద్దరి కలియికతో మరో చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది.

Mahesh Babu Trivikram Srinivas
మహేష్ త్రివిక్రమ్​ల కొత్త చిత్రం

By

Published : Aug 18, 2022, 10:55 PM IST

Mahesh-Trivikram movie release date: మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ సినిమా గురించి చిత్ర బృందం ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకుంది. ప్రజల్లో వీరిద్దరి కలయికపై సినిమా అంటే భారీగా అంచనాలుంటాయి.

‘ఎస్‌ఎస్‌ఎంబీ28’గా వస్తున్న ఈ సినిమాను 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక.

ప్రస్తుతం మహేష్‌ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఇటీవల ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో కసరత్తులు షురూ చేశారు. ‘అరవింద సమేత’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం ఎన్టీఆర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ దగ్గరే ట్రైన్‌ అయ్యారు. నిర్మాతలు చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయించడంతో ఈ కాంబో ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అన్నీ కుదిరితే, ఈ నెలలోనే చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details