'కేజీయఫ్' తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే తెరకెక్కుతున్నాయి. అయితే రీసెంట్గా 'పొగరు' సినిమాతో తెలుగు ఆడియెన్స్‌ను అలరించిన ధృవ సార్జా.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'మార్టిన్' అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్తో చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రంలో ఎంట్రీతోనే గూస్ బంప్స్ తెప్పించారు ధ్రువ సార్జా.
ఇకపోతే ఈ ప్రచార చిత్రాన్ని కూడా 'కేజీయఫ్' టీజర్ తరహాలోనే అన్ని భాషల వారికి అర్థమయ్యేలా విడుదల చేశారు. కథలో ఎక్కువ భాగం పాకిస్థాన్‌లోని ఒక జైల్లో సాగుతున్నట్లు చూపించారు. ఆ జైల్లో అనేక మంది పాకిస్థానీ ఖైదీల మధ్య ఉండే భారతీయ ఖైదీగా ధృవ సార్జా కనిపించారు. 'మీరంతా బలవంతులం అని అనుకుంటున్నారు. కానీ నేను బలవంతుడినని నాకు తెలుసు' అంటూ హీరో చెప్పే భారీ డైలాగ్ అదిరిపోయింది. ఇంకా ఈ టీజర్లో స్పోర్ట్స్ కార్స్, బైక్స్ ఛేజింగ్‌లు, కళ్లు చెదిరేలా యాక్షన్ సీన్లు మైండ్ బ్లోయింగ్‌లా ఉన్నాయి. చూస్తుంటే గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి.