టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలనో, లేదంటే అప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని క్లాసిక్ చిత్రాలనో ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే పలు హీరోల సినిమాలు రిలీజ్ కాగా.. వాటికి విశేషమైన స్పందన లభించింది. మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(మే 20) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'సింహాద్రి' సినిమాను కూడా రీ రిలీజ్ అయింది. ఏకంగా 1000కు పైగా స్క్రీన్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి తొలి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రికార్డు కలెక్షన్లను అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వరల్డ్ వైడ్‌గా రూ.5.2కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.90కోట్ల వరకు గ్రాస్ వచ్చిందట. నైజాంలో రూ.1.10కోట్లు, సీడెడ్ రూ.0.78కోట్లు, ఆంధ్ర రూ.1.56కోట్లు, కర్ణాటక రూ.0.32కోట్లు, తమిళనాడు రూ.0.13కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.34కోట్లు, యూఎస్ఏ రూ.0.46 కోట్లు వరకు గ్రాస్ వచ్చాయట.
ఫ్యాన్స్ లెక్కలు మరోలా.. 'సింహాద్రి' సినిమా ఫస్ట్ డే చూసేందుకు నందమూరి అభిమానులు థియేటర్లకు బారులు తీరారు. థియేటర్లంతా అభిమానుల సందడి వాతావరణంతో కిక్కిరిసిపోయాయి. అయితే ఈ చిత్ర రీరిలీజ్ కలెక్షన్స్ విషయంలో అభిమానులు చెప్పే లెక్కలు మరోలా ఉన్నాయి. వరల్డ్ వైడ్‌గా రూ. 6.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు వారు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. రూ.4 నుంచి రూ.6 కోట్ల మధ్యలో గ్రాస్ వసూలు వచ్చినట్లు తెలుస్తోంది.