సినిమా ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎంత ఫేమసో.. ప్రజలకు న్యాయం అందించే లాయర్ పాత్రలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించడంలో అంతే సక్సెస్ అవుతుంటాయి. మన హీరోలు చాలా మంది న్యాయవాదిగా నటించిన ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా అన్యాయానికి గురైన ప్రజల గొంతుకగా మారి వారి తరుపున లాయర్స్‌గా హీరోలు కోర్డులో వాదించే సన్నివేశాలు, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీస్ చాలానే ఉన్నాయి. మరి ఏది టాప్ లిస్ట్‌లో జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ.
ఏ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కింది? ఏ చిత్రాలపై ఎక్కువ మంది ఆసక్తిగా చూపిస్తున్నారు?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తుంటుంది ఈ సంస్థ. అలా ఈ సారి కోర్టురూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కి, అత్యధిక రేటింట్స్ సొంతం చేసుకున్న టాప్ 10 భారతీయ సినిమాల జాబితాను ప్రకటించింది. తమ యూజర్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది.