తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2023, 12:49 PM IST

ETV Bharat / entertainment

ఫస్ట్​ మూవీతోనే బ్లాక్​బస్టర్ అందుకున్న 'శ్రీకాంత్'..​ సుక్కు శిష్యుడా మజాకా!

దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్​ కొట్టడం​ అంత ఈజీ కాదు. అటువంటిది కొత్త దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల తన మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్​ను షేక్ చేసి తన సత్తా ఏంటో చాటుకున్నారు. దసరా సినిమాతో విజయాన్ని సాధించిన శ్రీకాంత్​ జర్నీ గురించి తెలుసుకుందాం.

dasara movie director srikanth odela biography
dasara movie director srikanth odela biography

'దసరా' సినిమా బాక్సాఫీస్​ వద్ద హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో నాని, కీర్తి సురేశ్​తో పాటు దీక్షిత్​ శెట్టి కీలక పాత్రలు పోషించారు. సముద్రఖని, సాయి కుమార్​, టామ్​ చకో కూడా తమ యాక్టింగ్​తో అదరగొట్టారు. ఇక సినిమాలోని ప్రతి సీన్​ మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపేలా ఉన్నాయి. ముఖ్యంగా నాని ఎంట్రీ సీన్​, ప్రీ క్లైమాక్స్​ సీన్​తో పాటు క్లైమక్స్​ సీన్స్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ​నాని కెరీర్​లో ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ దసరా సినిమా మరో ఎత్తు. అయితే నానితో పాటు టాలీవుడ్​ ఇండస్ట్రీకి ఇటువంటి బ్లాక్​ బస్టర్​ను ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి సినిమాతోనే హిట్​ టాక్​ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ విజయం వెనుక ఆ డైరెక్టర్​ శ్రమ ఎంతో ఉంటుంది. హీరో ఎంపిక నుంచి సినిమాలోని ప్రతి విషయంపై గురించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! కథను చిత్రీకరించే విధానంలో అసలు కాంప్రమైజ్​ అవ్వకుండా ప్రేక్షకుడికి నచ్చినట్టు తీయాలంటే అది రిస్క్​తో కూడిన పని. అటువంటిది కొత్త దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల తన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్​ను షేక్ చేసి తన సత్తా ఏంటో చాటుకున్నారు. తొలి సినిమానే పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కించి ఆ సినిమాతో మాసివ్​ సక్సెస్​ను అందుకున్నారు. ఆయన జర్నీని ఒకసారి చూస్తే..

ఆ సినిమా ఇన్స్​పిరేషన్​తో సుక్కు శిష్యుడిగా..
పదో తరగతిలో 'జగడం' సినిమా చూసి ప్రేరణ చెందిన శ్రీకాంత్​ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేసేందుకు తన తొలి ప్రయత్నం చేశారు. సినిమాల పైనున్న ఆసక్తితో దర్శకుడు సుకుమార్​ దగ్గర శిష్యరికాన్ని తీసుకుందామని నిర్ణయించుకుని ఆయన కంట్లో పడేందుకు శతవిధాలుగా ప్రయత్నించారట. ఆయన ఇంటి ముందు నిల్చున్నప్పటికీ ఆయన్ను కలిసే ఛాన్స్​ రాకపోవడం వల్ల నిరాశతో వెనుతిరుగుతున్న శ్రీకాంత్​ను నాలుగేళ్ల తర్వాత సుకుమార్ ఓ సారి పిలిచారట. తన ఆసక్తిని గమనించిన సుకుమార్.. శ్రీకాంత్​ను ఓ షార్ట్​ ఫిల్మ్​ తీయమని చెప్పారట. అలా శ్రీకాంత్​ వర్క్​ నచ్చి నాన్నకు ప్రేమతో సినిమాలో అసిస్టెంట్​ డైరెక్టర్​ ఛాన్స్​ ఇచ్చారట. అలా సుకుమార్​ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్​.. ఆ తర్వాత వచ్చిన 'రంగస్థలం' సినిమాకు కూడా పనిచేశారు.

సంగీత దర్శకుడు సంతోశ్​​ నారాయణ్​​తో శ్రీకాంత్​

టెస్ట్​ షూట్​ చూశాకే..
'రంగస్థలం' చిత్రీకరణ సమయంలోనే తనకు ఓ సినిమా తీయాలన్న ఆలోచన కలిగింది. ఈ సినిమా అయిపోయాక 'దసరా' సినిమా రెడీ చేసుకుని నిర్మాత సుధాకర్‌ చెరుకూరిని అప్రోచ్​ అయ్యారట. ఇక స్టోరీ విన్న నిర్మాత.. సినిమాకు ఓకే చెప్పి ఈ కథను నానికి వినిపించమన్నారట. అయితే నాని.. కొన్ని సన్నివేశాల్ని టెస్ట్‌ షూట్‌గా చేసుకొని వచ్చి చూపించమన్నారట. అవి నచ్చాక సినిమా చేయడానికి ఓకే చెప్పారట. అలా దర్శకుడిగా తన తొలి సినిమా జర్నీ ప్రారంభమయ్యింది. ఇక ఏడాది పాటు శ్రమించి ఈ బ్లాక్​ బస్టర్​ సినిమాను ప్రేక్షకులను అందించారు.

నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నారు దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల. తన బాల్యాన్ని గడిపిన వీర్లపల్లి అనే గ్రామం గురించే ఈ సినిమాను తీశారు. స్నేహం, ప్రేమ, త్యాగం లాంటి భావోద్వేగాలను తనదైన శైలిలో చిత్రీకరించి ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు.

ABOUT THE AUTHOR

...view details