Bro movie teaser : పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్, సాయితేజ్‌ల ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్‌కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Pawan kalyan bro movie : ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ప్రచార చిత్రాన్ని కట్ చేశారు. పోస్టర్లో చూపించినట్టే.. 'తమ్ముడు' సినిమాలో రైల్వే కూలీ గెటప్‌ను రీక్రియేట్ చేశారు. 'ఏంటిగి.. ఇంత చీకటిగా ఉంది.. ఎవండి ఎవరూ లేరా.. హలో మాస్టరూ.. గురువు గారు.. హలో తమ్ముడు.. బ్రో' అని తేజ్ డైలాగులు చెప్పడంతో టీజర్ ప్రారంభమైంది. 'కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం' అంటూ తన మార్క్ స్టైల్లో కాలం గురించి పవన్ చెప్పే డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. అయితే ఈ ప్రచార చిత్రంలో యాక్షన్ యాంగిల్ ఏమీ చూపించలేదు. మరి సినిమాలోనైనా ఉన్నాయో లేదో. సాయి తేజ్ కూడా చిత్రంలో మార్క్ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అదరగొట్టేశారు. మొత్తంగా టీజర్ ఓ ఫన్ రైడ్‌గా సాగింది. ప్రమాదంలో చనిపోయిన సాయి తేజ్‌కు మరో అవకాశం ఇవ్వడానికి.. భూమి మీదకు వచ్చిన మోడ్రన్ దేవుడిగా పవన్ కనిపించారు. మరో రెండో అవకాశం అందుకున్న తేజ్.. తన జీవితంలో ఎలాంటి మార్పులను చూశారనేది ఈ సినిమా కథాంశం. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది.
Pawan kalyan sai dharam tej movie : ఇక ఈ 'బ్రో' సినిమాకు.. మాస్ మహారాజా రవితేజ నటించిన 'శంభో శివ శంభో', నేచురల్ స్టార్ నాని నటించిన 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'వినోదయ సీతమ్' పేరుతో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందింది సూపర్ హిట్‌ను అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 28న తేదీన సినిమా గ్రాండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.