అడివి శేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం హిట్2. ది సెకండ్ కేస్.. అన్నది ఉపశీర్షిక. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'హిట్ ది ఫస్ట్ కేస్'కు సీక్వెల్ ఇది. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ తేజ ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా అదిరిపోయిందని ప్రశంసలు కురిపించారు. ఆ మూవీ టీమ్‌తో కలిసి పవర్‌ప్యాక్డ్ సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ సెల్ఫీల్లో అడివిశేష్, నాని, శైలేష్ కొలను, మోక్షజ్ఞ, బాలయ్య ఉన్నారు.
ఆ ఫొటలోను అడివిశేష్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ అదిరిపోయే విషయాన్ని కూడా చెప్పారు. ఏంటంటే.. ఈ హిట్ ఫ్రాంచైజీలో నటించాలని బాలయ్యను రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. "బాలయ్యకు హిట్ 2 సూపర్‌గా నచ్చింది. మా సినిమాను ప్రశంసించారు. అయితే నేను ఓ చిన్న జోక్ చేశాను. హిట్ ఫ్రాంచైజీలో కనిపించమని ఆయన్ను రిక్వెస్ చేశాను. దానికి ఆయన ఓ నవ్వు నవ్వారు... కానీ ఏదైనా జరగొచ్చు!" అని రాసుకొచ్చారు. కాగా, ఇప్పటికే ఈ హిట్ ఫ్రాంచైజీలో పలువురు స్టార్స్ కనపడతారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.