Animal Movie Telugu Trailer :బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - 'అర్జున్ రెడ్డి' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మూవీ టీమ్.. అందులో భాగంగా.. ఓ పవర్ ప్యాక్డ్ సాలిడ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం వైలెంట్ మోడ్‌లో ఉన్న ఈ వీడియో.. అటు రణ్‌బీర్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
Animal Movie Trailer :తండ్రీ కోసం ఏదైనా చేసే ఓ తనయుడిగా రణ్‌బీర్ ఈ వీడియోలో కనిపించారు. తన తండ్రిని అమితంగా ప్రేమించే ఓ కొడుకు తన తండ్రీ కోసమే వైటెంట్గా ఎలా మారుతాడు అన్నది ట్రైలర్ సారంశం. ఇందులో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు రణ్‌బీర్. తన లుక్స్‌తోనే కాకుండా డైలాగ్స్తోనూ నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.
"మా నాన్నని షూట్ చేసిన వాడిని.. నా చేతులతోనే వాడి గొంతు కోస్తాను", "ఇక నుంచి మీ కోసం వెయ్యి చేస్తాను నాన్న, ప్రతిసారీ మీ పర్మిషన్ అడగలేను", "ఇక మీ మీద ఈగ వాలినా సరే దిల్లీ తగలబెట్టేస్తాను" అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్స్ చూస్తుంటే.. ఆయనకు తండ్రిపై ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.