మృణాల్ ఠాకుర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోయినప్పటికీ.. 'సీతారామం'లో సీతా అంటే అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ క్యారెక్టర్‌కున్న క్రేజ్ అలాంటిది మరి. ఈమె హిందీ ఆడియన్స్‌కు సుపరిచితమైనప్పటికీ మన దక్షిణాదిన సీతా రామంతోనే పరిచయమయ్యింది. అందమైన కళ్లతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన మన సీతామహాలక్ష్మీ తెలగునాట తన మొదటి సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టడమే కాకుండా పలువురి ప్రముఖుల నుంచి ప్రసంశలు అందుకుంది.
ఈ సినిమాతో సౌత్‌లో మృణాల్ ఫేమ్ ఒక్కసారిగా మారిపోయింది. తన కాల్షీట్స్ మొత్తం వరుస సినిమాలతో నిండపోయాయి. కానీ ఈ అమ్మడి నుంచి ఎటువంటి తాజా అప్డేట్స్ రాలేదు. అయినప్పటికి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక రూమర్స్ అప్డేట్లోనే ఉంది. తాజాగా మృణాల్ నేచురల్ స్టార్ నానిని కలిసింది.