తెలంగాణ

telangana

ETV Bharat / elections

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 95 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటింగ్​ జరుగుతోంది.

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం

By

Published : Apr 18, 2019, 7:28 AM IST

Updated : Apr 18, 2019, 7:35 AM IST

11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతలోని మొత్తం 95 లోక్​సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 1600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని 15.79 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనునున్నారు.

ఛత్తీస్​గఢ్​ నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలింగ్​ ప్రారంభమైంది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

తమిళనాడులో 38 లోక్​సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

రెండో దశ పోలింగ్​లో లోక్​సభకు ప్రముఖులు బరిలో ఉన్నారు. కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్​, సదానంద గౌడ, పొన్​ రాధాకృష్ణ, కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్​ డి దేవగౌడ, తమిళనాడు నుంచి ఏ రాజా, కనిమొళి పోటీలో ఉన్నారు.

మొత్తం ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే 19న తుది దశ పోలింగ్​తో ముగుస్తాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం
Last Updated : Apr 18, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details