love issue: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌కు చెందిన ఖయ్యుం అనే వ్యక్తి నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు. లోకేశ్వరం మండలం గడ్‌చాందకు చెందిన మంద ప్రసాద్ అనే యువకుడు నిర్మల్‌లోనే ఉంటూ మరో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే యువతితో ఇతడికి పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.
మరొకరితో చనువుగా ఉంటొందని...
yoing man murdered: ఇద్దరూ చనువుగా ఉంటున్న విషయం తెలిసిన ఖయ్యుం తరచూ ప్రసాద్‌తో గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లిన ఖయ్యుం, అక్కడ ఆమె లేకపోవడంతో కాసేపు ఎదురుచూశాడు. వచ్చాక ఆమెతో గొడవపడ్డాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న ప్రసాద్ అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఖయ్యుం తనవెంట తెచ్చుకున్న కత్తితో అతడి గుండెలో పొడిచి అక్కడ్నుంచి పరారయ్యాడు.