Woman Rape in Vijayawada : ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతకు నిదర్శనం ఈ మహిళ. కళ్ల ముందే భర్త మరో మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి పైశాచికంగా వ్యవహరించింది. తప్పు చేస్తున్న భర్తకు సహకరించి.. మరో మహిళపై అతడు అత్యాచారానికి పాల్పడుతుండగా ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసింది. ఈ అమానుష ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Vijayawada Rape Case News : విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత (25) భర్త కేటరింగ్ పని చేస్తుంటారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వీరి ఎదురింట్లో దిలీప్, తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో వివాహిత ఇంట్లోకి వారు అక్రమంగా ప్రవేశించారు. వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది.