తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime: మాయమాటలు చెప్పారు... 13 లక్షలు దోచేశారు

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా పార్ట్ టైం జాబ్ పేరుతో హైదరాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ. 13 లక్షలు దోచుకున్నారు.

Cyber Crime
Cyber Crime

By

Published : Oct 3, 2021, 8:24 AM IST

మాయమాటలు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.13 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్​లోని బాలానగర్​లో చోటుచేసుకుంది. ఫెరోజ్ గూడకు చెందిన అనిల్ కుమార్ ఇన్ఫోసిస్‌ కంపెనీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతడికి ఫ్లిప్​కార్ట్​లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ రాగా వారిని సంప్రదించాడు. అనంతరం అనిల్​కి ఓ లింక్ పంపి దాని ద్వారా రిజిస్టర్ అవ్వాలని సైబర్ నేరస్థులు సూచించారు.

వివరాలు నమోదు చేసి అందులో వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా లాభాలు పొందొచ్చని బాధితుడికి సైబర్ నేరస్థులు సూచించారు. నమ్మిన అనిల్ అందులోని వస్తువులను రూ.9.67 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. అనంతరం లాభాలు పొందిన అనిల్ నగదును బదిలీ చేసుకునేందుకి ప్రయత్నించగా నగదు విత్​డ్రా కావడం లేదు. దాంతో వారు ముందుగా ఏర్పాటు చేసిన టెలిగ్రామ్​లోని గ్రూప్ ద్వారా సంప్రదించగా స్పందించిన మహిళ... నగదు విత్​డ్రా చేసుకోవాలంటే రూ.3.31 లక్షల రీఛార్జ్ చేయాలని సూచించింది.

రీఛార్జ్ చేసినప్పటికీ విత్ డ్రా కాకపోవడంతో బాధితుడు అనిల్ మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్యోగాల పేరుతో నగదు పెట్టుబడి పెట్టాలని సూచిస్తే నమ్మొద్దని, అవన్నీ సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ అని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:Telugu academy scam: నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్

ABOUT THE AUTHOR

...view details