Suicide: ఓ యువకుడు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అది తీర్చకపోవడంతో సిబ్బంది వచ్చి అడిగారు. తర్వాత ఏమైందో ఏమో.. తాను గోదావరిలో దూకి, చనిపోతున్నట్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవానికి చెందిన కొడమంచిలి శివకుమార్(30) 2021లో రామచంద్రాపురంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేసేవారు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకునేవారు. కుటుంబ అవసరాల కోసం క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకున్నారు. అది తీర్చకపోవడంతో ఈనెల 19న బ్యాంకు సిబ్బంది వచ్చి అడిగారు.
ఆ తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మంగళవారం అర్ధరాత్రి రోడ్కం రైలు వంతెనపైకి వచ్చారు. 12.30ల సమయంలో తండ్రి కొండయ్యకు ఫోన్ చేసి గోదావరిలోకి దూకేస్తున్నట్లు చెప్పారు. వంతెన 115వ స్తంభం వద్ద శివ కుమార్ ద్విచక్ర వాహనం, చరవాణి, చెప్పులను గుర్తించారు. ఈ ఘటనపై భార్య తులసి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గల్లంతైనట్లు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ పి.రామకృష్ణ తెలిపారు.
పశ్చిమ గోదావరిలో..ఆన్లైన్ యాప్లో రుణం తీసుకుని చెల్లించినా.. ఆ సంస్థ నిర్వాహకులు ఫోన్లో వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో చోటుచేసుకుంది. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి గిరిప్రసాద్(26) ఎంబీఏ చదివి హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ యాప్లో కొంత రుణం తీసుకున్నాడు.