తెలంగాణ

telangana

ETV Bharat / crime

వరద సహాయక చర్యల్లో విషాదం.. గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది దుర్మరణం

Rescue team: కుమురం భీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతులు
మృతులు

By

Published : Jul 14, 2022, 10:50 AM IST

Rescue team: కుమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండలంలోని పెసర కుంట పెద్ద వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీమ్​ను పంపించింది. అక్కడ ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నిన్న గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు గల్లంతైన వారి మృతదేహాలను కనుగొన్నారు. మృతులు సతీష్, రాము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details