తెలంగాణ

telangana

ETV Bharat / crime

కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు

హైదరాబాద్‌లో అపహరణకు గురైన బాలుడిని పోలీసులు రక్షించారు. బాలుడి కోసం వెతికే క్రమంలో దాదాపు 300 సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ చెప్పారు.

three years old boy rudramani rescued from kindapers: hyderabad cp anjanikumar
కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు

By

Published : Feb 19, 2021, 4:12 PM IST

ఫిబ్రవరి 8న హైదరాబాద్​లోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద మూడేళ్ల బాలుడు రుద్రమణి​ని దుండగులు కిడ్నాప్​ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా విచారణ జరిపారు. బాలుడిని అపహరించి మహారాష్ట్రకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.

కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు

మహారాష్ట్ర వెళ్లిన పోలీసు బృందం అక్కడి పోలీసుల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌ జిల్లాలో నిందితుడు షామ్ సోలంకిని అరెస్ట్​ చేసినట్లు హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​ తెలిపారు. బాలుడిని వెతికే క్రమంలో దాదాపు 300 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినట్లు చెప్పారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:అప్పు చెల్లించమన్నందుకు చంపి పూడ్చేశాడు..

ABOUT THE AUTHOR

...view details