Suspicious Death In Hyderabad: సహజీవనం చేస్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలాపూర్ మండల్ లెనిన్‌నగర్‌కు చెందిన తూర్పాటి చెన్నమ్మ కుమార్తె సరస్వతి(30)కి 13 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తితో వివాహమైందని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు. తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి సూచనతో.. నాటి నుంచి సరస్వతి లెనిన్‌నగర్‌లోనే ఉంటూ కూలీ పనులు చేయసాగింది.
నలుగురు పిల్లలనూ ఓ వసతి గృహంలో చేర్పించి చదివిస్తుంది. కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పలో సాదుల మహేందర్(21) నివసిస్తున్నాడు. మూడేళ్ల నుంచి అతడితో సరస్వతి సహజీవనం సాగిస్తోంది. తల్లి చెన్నమ్మ, అన్న యాదగిరి వారించినా వినకుండా.. మహేందర్‌తో తన పెళ్లి అయ్యిందని చెప్పి అతడితోనే ఉండసాగింది. ఇటీవల మహేందర్, సరస్వతి మధ్య తరుచూ ఘర్షణ పడసాగారు. దీంతో లెనిన్‌నగర్‌లోని పుట్టింటికి ఆమె చేరుకుంది.