సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
110 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్ మండలంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Breaking News
తూముకుంటకు చెందిన నిందితుడు మహేశ్.. రేషన్ దుకాణాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి శివారులోని పొలంలో నిల్వ ఉంచాడని పోలీసులు వెల్లడించారు. వాటిని వేరే బస్తాల్లోకి మార్చి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు తరలించాడానికి ప్రయత్నించాడని తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని పౌర సరఫరాల అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?