ED raids in Musaddilal Gems and Jewellery: ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్‌లో రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. 3 షోరూంలలో రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారం, వజ్రాలు సీజ్ చేశారు. రూ.50 కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తాకు చెందిన ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇరువురిపై సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తోంది. బంగారం అమ్మకాల సొమ్మును ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ గుర్తించింది. గతేడాది రూ.323 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
గతంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నోట్ల రద్దు సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి నగదు చలామణి చేశారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి.. 130కోట్ల రూపాయల ఆస్తులను గతేడాది ఫిబ్రవరిలో అటాచ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌కు చెందిన యాజమాన్యం డబ్బులను వారి ఖాతాలో భారీ ఎత్తున డిపాజిట్ చేశారు.