ఏపీలోని కృష్ణా జిల్లా 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఏపీలోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
ఏపీ ప్రమాదం, లారీని ఢీకొట్టిన బైక్
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి, కుమార్తె మృతి చెందారు. భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బైక్‌పై దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. బాధితులు నాగాయలంక వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు