Kidnapped Bridegroom Brother in Hyderabad: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహంపై అమ్మాయి బంధువులు కక్ష గట్టారు. వివాహంపై కోపంగా ఉన్న పెళ్లికుమార్తె బావ... పెళ్లికుమారుడు అన్నయ్యని అపహరించాడు. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన కృష్ణ శర్మ అనే యువకుడు చేవెళ్ల ప్రాంతానికి చెందిన యువతితో గత శుక్రవారం కూకట్‌పల్లి ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ప్రేమ వివాహంపై కక్ష.. పెళ్లి కుమారుడి అన్నయ్యను కిడ్నాప్ చేసిన యువతి బంధువులు - ప్రేమ వివాహంపై కక్ష యువకుడు కిడ్నాప్
Kidnapped Bridegroom Brother in Hyderabad: ప్రేమ వివాహంపై కక్ష గట్టిన అమ్మాయి తరఫు బంధువులు పెళ్లి కుమారుడి సోదరుడ్ని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కిడ్నాప్‌నకు గురైన యువకుడు తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Kidnap
ఇది తెలుసుకున్న పెళ్లికుమార్తె సోదరి భర్త... ఈరోజు 10 గంటల సమయంలో లంగర్ హౌస్‌లో పెళ్లికుమారుడు అన్నయ్య ప్రవాస శర్మను కిడ్నాప్ చేశాడు. విషయాన్ని వీడియో కాల్ ద్వారా ప్రవాస శర్మ తల్లిదండ్రులకు తెలియజేశాడు. అప్రమత్తమైన లంగర్ హౌస్ పోలీసులు... కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదవగా వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: