తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహిళలపై ద్వేషంతోనే వరుస హత్యలు చేస్తోన్న సీరియల్​ కిల్లర్​ అరెస్ట్​ - మిస్టరీని ఛేదించిన పోలీసులు

Psycho Killer Arrest కట్టుకున్న భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని విడాకులు తీసుకోవటంతో మొత్తం మహిళాజాతిపైనే విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. అప్పటినుంచి మహిళలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాడు. వరుసగా మహిళలను హతమారుస్తున్న ఆ సైకో కిల్లర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

police-solved-serial-murders-mystery-at-pendurthi-in-visakha-district
police-solved-serial-murders-mystery-at-pendurthi-in-visakha-district

By

Published : Aug 16, 2022, 8:58 PM IST

Psycho Killer Arrest: ఏపీలోని విశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్ రాంబాబును అరెస్టు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్ తెలిపారు. వారం రోజుల్లో మూడు హత్యలు చేసిన రాంబాబు అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. 2018లో రాంబాబు భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడని వివరించారు. రాంబాబుకు కూతురు (26) కొడుకు (27) ఉన్నారని..ఇద్దరూ తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదని తెలిపారు. అంతేకాక రియల్ ఎస్టేట్​లో ఏజెంట్​గా​ పని చేస్తున్న సమయంలో యాజమాని చేతిలో మోసపోయాడని తెలిపారు. అప్పటినుంచి మహిళల మీద కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు.

"ఈ నెల 8న వృద్ధ దంపతులను, 15న మరో మహిళను చంపాడు. భార్యతో విడాకులు తీసుకున్నాడు, పిల్లలు దగ్గరకు రానివ్వడం లేదు. కుటుంబానికి దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. ఆడవాళ్లను చంపేయాలన్నదే రాంబాబు ప్రధాన ఉద్దేశం. రాంబాబు వద్ద సెల్‌ఫోన్ లేకపోవడం వల్ల పట్టుకోవడం కష్టమైంది. నిందితుడు ఆలయాలు, ఫంక్షన్‌ హాళ్లలో తింటూ కాలక్షేపం చేస్తున్నాడు."- సీపీ శ్రీకాంత్​

మహిళలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని హత్యలకు పాల్పడ్డాడని ఆగస్టు 6న వాచ్​మెన్ దంపతులను మొదటగా హత్య చేశాడని తెలిపారు. హత్య అనంతరం చనిపోయిన వాళ్లలో మహిళ ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్​ను చూసేవాడని పేర్కొన్నారు. తరువాత వాటిపై కాలితో తన్నెేవాడని.. వారం తరువాత ఆగస్టు 14న తేదీన మరో మహిళను హత్య చేశాడని సీపీ వెల్లడించారు. మొత్తం మూడు హత్యలతో పాటు జులై 8న మరొకరిపై హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. హత్యలన్నింటికి ఇనుప రాడ్​ను వినియోగించాడని.. రాడ్డుతో తలపై మోది చంపేవాడని వివరించారు.

వాచ్​మెన్​లు అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుందని వాళ్లను ఎంచుకున్నాడని పేర్కొన్నారు. కొద్ది నెలలు నుంచి రాంబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, తను అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడని చెప్పారు. రాంబాబుకు కూతురు (26) కొడుకు (27) ఉన్నారని..ఇద్దరూ తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదని అన్నారు. గతంలో హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్​లో పని చేసినట్లు సీపీ శ్రీకాంత్​ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details