తెలంగాణ

telangana

ETV Bharat / crime

police cordon search: వీసాల గడువు ముగిసినా.. ఇక్కడే ఉంటున్నారు! - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

police cordon search operation: రాజేంద్రనగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. 40 మంది విదేశీయులను అదుపులోకి తీసుకుని వారి వీసాలను తనిఖీ చేశారు. వీసా గడువు ముగిసిన 10 మంది అక్రమంగా ఇక్కడే ఉంటున్నట్లు గుర్తించారు.

police cordon search
police cordon search

By

Published : Dec 2, 2021, 11:36 AM IST

police cordon search operation: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ, బండ్లగూడా, పీఎన్ టీ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 40 మంది విదేశీయులను అదుపులోకి తీసుకుని... వారి వీసాలను పరిశీలించారు. వీసా గడువు ముగిసిన 10 మంది అక్రమంగా ఇక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. వారి వివరాలు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పంపి... వారి దేశాలకు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ వారు ఆఫ్రికా, సూమాలియా, నైజీరియా, కాంగోకు చెందిన వారుగా గుర్తించినట్లు డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. ఇతర దేశస్థులకు ఇళ్లు అద్దెకిచ్చే ముందు ఎఫ్‌ఆర్‌ఆర్ఓకు తప్పక సమాచారం ఇవ్వాలని స్థానికులకు తెలిపారు. లేకుంటే ఇళ్లు అద్దెకు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్ చేపట్టామని డీసీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో డీసీపీతో సహా మొత్తం 150 మంది పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Minor Girl Suicide : ప్రేమను జయించలేక.. బాలిక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details