శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకిపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని.. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్యాకింగ్ కవర్ల లోపల పలుచటి రేకులు రూపంలో బంగారాన్ని దాచి అక్రమంగా తెచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకిపైగా బంగారం పట్టివేత - gold seized at hyderabad airport
దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి నుంచి కిలోకిపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరికి అదుపులోకి తీసుకొన్న అధికారులు.. హైదరాబాద్లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకొస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రూ.47.63 లక్షల విలువైన 1.026 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇద్దరికి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకువచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇవీచూడండి:దారుణం: హత్య చేసి.. ఫ్రిజ్‌లో పెట్టారు!