మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ గాగిల్లాపూర్కు చెందిన ప్రవీణ్ రెడ్డి అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై కొంపల్లి వెళ్తున్న సమయంలో కారు ఢీ కొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి - kompally road accident
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా ఒకరు మృతి చెందిన ఘటన... మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రోడ్డు ప్రమాదం