సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం(electric shock) చోటుచేసుకుంది. నేడు తెరాస ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా(TRS dharna) సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఓ యువకుడు విద్యుదాఘాతం(electric shock)తో మృతి చెందాడు. ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
TRS dharna: తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా అపశృతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి - one died in trs dharna arrangements
06:58 November 12
ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతం
గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రంగా చౌరస్తాలో.. తెరాస ధర్నా(TRS dharna) నిర్వహించేందుకు భారీ ఫ్లెక్సీలను యువకులు కడుతున్నారు. ఆ సమయంలో బహుళ అంతస్తుకు ఆనుకొని ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు(electric shock)... కందుకూరి సునీల్, కుడుముల వెంకటేశ్‌కు తగలడంతో కిందపడ్డారు. గమనించిన యువకులు.. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి సునీల్ మరణించాడు.
కాగా సునీల్ మృతిపై బంధువులు, యువకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం జరిగిన నలభై నిమిషాల వరకు సునీల్ బతికే ఉన్నాడని.. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందకనే అతను మరణించినట్లు బంధువులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగాలంటూ రంగా చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అప్పటివరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. గులాబీ పార్టీ ఈ రోజు ధర్నా(TRS dharna) నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు