నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఈ నేపధ్యంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురికాగా ప్రాణాపాయం తప్పింది.
ఆమనగల్లు గ్రామానికి చెందిన మెరుగు నవీన్... అదే గ్రామానికి చెందిన కోల సుధాకర్ కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో నవీన్ కుటుంబం, కోల మల్లయ్యపై వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, వేధింపుల కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.