తెలంగాణ

telangana

ETV Bharat / crime

కన్నతల్లి కర్కశత్వం.. కూతురు గొంతు కోసిన తల్లి - telangana varthalu

మతి స్థిమితం లేని మహిళ, భర్తతో గొడవ పడి మూడేళ్ల చిన్నారి గొంతు కోసింది. అనంతరం తాను గొంతు కోసుకుంది. ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లాలోని పులిమామిడి గ్రామంలో చోటుచేసుకుంది.

mother strangled her daughter
కన్నతల్లి కర్కశత్వం.. కూతురు గొంతు కోసిన తల్లి

By

Published : Jun 3, 2021, 9:12 PM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో అభం శుభం తెలియని కూతురు పట్ల కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఈ ఘటన బుధవారం రాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొతోళ్లు రమేష్, మంజుల దంపతులకు నలుగురు సంతానం. ఈ క్రమంలో బుధవారం తమ పెద్ద కుమారుడు శివ కుమార్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జన్మదిన వేడుకల అనంతరం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

దీనితో సహనం కోల్పోయిన తల్లి మంజుల చిన్న కూతురు శివాని (3) గొంతును బ్లేడ్​తో కోసింది. ఆ తర్వాత తాను కూడా గొంతును కోసుకుంది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని స్థానికులు చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మంజుల కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తోందని ఆమె భర్త రమేష్, చుట్టుపక్కల నివాసముంటున్న కాలనీ ప్రజలు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Baby Murder: మూడేళ్ల బిడ్డను చంపి అంత్యక్రియలు..

ABOUT THE AUTHOR

...view details