తెలంగాణ

telangana

ETV Bharat / crime

పసికందును బావిలో పడేసిన తల్లి.. పోలీసుల ఎంట్రీతో..! - పసికందును బావిలో పడేసిన తల్లి

Mother killed Child: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆ పసికందు పాలిట మృత్యువైంది. తల్లి ఒడిలో నిద్రపోవాల్సిన ఆ చిన్నారి బావిలో విగతజీవిగా తేలింది. ఐదు నెలల కూతురిని బావిలో పడేసి కన్నతల్లే ప్రాణాలు తీసింది. ఈ అమానవీయ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Mother killed Child
Mother killed Child

By

Published : Nov 13, 2022, 3:52 PM IST

Mother killed Child: నారాయణపేట జిల్లా కోస్గిలో దారుణం చోటుచేసుకుంది. ఐదు నెలల పసికందును తల్లి బావిలో పడేసింది. అభం శుభం తెలియని చిన్నారి పాలిట కన్నతల్లే మృత్యుపాశమైంది. వివరాల్లోకి వెళితే.. కోస్గి పట్టణ కేంద్రంలో నివసిస్తున్న గోవిందు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక కొడుకు, కూతురు ఉండగా.. రెండో భార్య ఆశమ్మ ఐదు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి మూడు గంటల సమయంలో ఆశమ్మ తన పసిబిడ్డను బావిలో పడేసింది.

ఉదయం కుటుంబ సభ్యులు పసిబిడ్డ కోసం వెతికారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆశమ్మపై అనుమానంతో విచారించగా.. మూగ అయిన ఆశమ్మ.. సైగలతో తనే బావిలో పడేసినట్లు తెలిపింది. స్థానికుల సహాయంతో పోలీసులు పసిబిడ్డ మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీశారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details