ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సెంటర్లో విషాదం జరిగింది. జిల్లాకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లి సుబ్బులు(27), కుమార్తె మధురవాణి (5) మృతి చెందారు.
విషాదం: ఇద్దరు పిల్లలతో సహా నిప్పంటించుకున్న తల్లి - nellorepalem latest news
ఏం కష్టం వచ్చిందో ఆ తల్లికి.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. నవమాసాలు మోసిన కన్నపిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్లాలనుకుంది. తను పోయాక పిల్లలను ఆదరించేవారు లేక కష్టపడతారనుకుందేమో..? పిల్లలతో పాటు తల్లి బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సమీపంలో చోటు చేసుకుంది.
పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య
నిప్పు చూసి భయంతో పారిపోయి వచ్చిన కుమారుడు మహేశ్ ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతనికి గాయాలయ్యాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:నోములలో విషాదం.. పిడుగుపాటుకు 2 ఎడ్లు మృతి