మానసిక ఒత్తిడి తట్టుకోలేక బీడీఎస్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన రాజ్వీర్ సింగ్ ఆర్మీ సుబేదార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుమార్తె సునంద.. జవహర్‌నగర్ పరిధిలోని ఓ డెంటల్ కళాశాలలో బీడీఎస్ చదువుతోంది. 2016 బ్యాచ్‌కు చెందిన సునంద.. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి తగ్గేందుకు వైద్యుడిని సంప్రదించింది. చికిత్స అనంతరం ఆ పరిస్థితి నుంచి యువతి కోలుకుంది.
Suicide: మానసిక ఒత్తిడికి లోనై.. విద్యార్థిని ఆత్మహత్య.!
హైదరాబాద్ జవహర్‌నగర్‌లో వైద్య విద్యార్థిని.. ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా రెండు రోజుల క్రితం సునంద తల్లి వీడియో కాల్లో ఆమెతో సంభాషించినట్లు జవహర్‌నగర్ పోలీసులు వెల్లడించారు. వారిద్దరి సంభాషణలో ఆమె తన వివాహానికి సంబంధించిన విషయం ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సునంద ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి:Heavy Floods : మున్ముందు వరద ముప్పు.. జాగ్రత్తలు సూచిస్తోన్న జీహెచ్ఎంసీ