కళాశాలకని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె చరవాణి సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
'కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది'
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది
జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన గుగులోతు జ్యోతి(20) ఈ నెల 19న హన్మకొండలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు రాయపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు