వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రిలో 30 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సారంగపాణి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం సారంగపాణి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించాడని ఆందోళన
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి మృతిచెందాడు. అతడి మరణానికి వైద్యులే కారణమంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించడం వల్లే మరణించాడని వైద్యులు తెలిపారు.
ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి మృతి
వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తన భర్త మృతి చెందేవాడు కాదని మృతుని భార్య ఆరోపించారు. సారంగపాణికి మెరుగైన చికిత్స అందించామని శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరాడని.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా మృత్యువాత పడ్డారని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్